Chinni chinni diaglogues from Prasthanam movie  

Posted by Madarapu

మనిషి నేల మీద రాలిన దగ్గరనుండి చచ్చే దాకా నిప్పులా మండుతూనే ఉంటాడు. ఆకలితో మండుతాడు. కోపంతో మండుతాడు. కోరికతో, ఈర్ష్యతో  మండుతూనే ఎదుగుతాడు. ఆ మంటతో కొందరు ముట్టుకున్న వస్తువులల్లా తగలెడుతూ మండే సుడిగుండాల్లా ఎదుగుతారు. ఇంకొందరు అదే మంటతో జ్ఞానాన్ని వెతుక్కుంటూ లోకానికి దారిచూపే దీపాల్లా ఎదుగుతారు. ఆ వెలుగు నీలో కనిపిస్తున్నదనే జనమంతా నీ వెంట పడుతున్నారు. వాళ్ళ అభిమానంలో అహాన్ని చూసుకుంటావో, భాద్యత తెలుసుకొని దీపంలా ఎదుగుతావో నీ చేతుల్లోనే ఉంది.


మనదేశంలో ఎలెక్షనే పెద్ద డ్రామా, ప్రజలే మహానటులు. డ్రామాకి నిజానికి తేడా మనకన్నా వాళ్ళకే బాగా తెలుసు. నీకెలా కావాలంటే అలా రాసుకో.


జరిగిన ఘోరానికి నా గుండె పగిలిపోతోందిరా నాన్నా .. కానీ ఈ నెత్తురు ఇంతటితో ఆగనివ్వరా ..!
ఇక్కడితో ఆగితే ధర్మం తూగదు నాన్న.. !


ఇన్నిరోజులు నాయకుల కోసమే బతికి మేము మోసపోయాం. కానీ మాకోసం బతికే నాయకుడు ఒకడు కావాలి. మంచి చెడు తెలిసిన మునిలాంటి మనిషి కావాలి.


పాతికేళ్ళు, పాతికేళ్ళు నువ్వు చేసిన పాపాన్ని నీ గూట్లోనే పాతిపెట్టావ్. ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలగొట్టే పాత్రే లేదు. నీకు తీర్పు ఇచ్చే శాసనం లేదు.
ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాలకోసం దారులు తప్పే పాత్రలు తప్ప, హీరోలు విలన్లు లేరీ నాటకంలో. మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగులో కదిలించే నిజం ఒక్కటే ఆకలి. తపించే ఆత్మనల్లా శాసించె శక్తి ఒక్కటే ఆశ. ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తుల్లా కరిగిపోతాయి. ఆరోజు ఆక్షణం నా స్వాదీనంలో చేసిన తప్పుకోసం జీవితమంతా లెక్క చెల్లిస్తూనే ఉన్నాను. తండ్రిలా భర్తలా బంట్రోతులా .... ఆలోచించి చేసినవాన్నైతే ఆరోజే వీన్ని చంపి నిజాన్ని పాతిపెట్టేవాన్ని. నా ప్రస్థానంలో ఈ గంటదాటి నేను బతకాలి అంటే మీరు చావాలి. నా నిజస్వరూపాన్ని ఎత్తిచూపే గుర్తులన్ని చెరిగిపోవాలి. చంపు.. నీ పగ తీర్చుకో... మీ వెలుతురులో నేను బతకలేనురా.. నన్ను చీకటిని చేసావ్.


కాలగర్భంలో చీకటి వెలుతురులా మనిషిలోని మంచిచెడులు ఎప్పుడు పోరాడుతూనే ఉంటాయి. ఆ తీరని మానవ ప్రస్థానం - మనిషి తాను విత్తిన పంటనే కోస్తాడు.

This entry was posted on Samstag, 8. Mai 2010 at 03:57 . You can follow any responses to this entry through the comments feed .

0 comments

Kommentar veröffentlichen